ఈ ప్రయాణం ఎంతో అందమైనది: రకుల్​

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరికలేకుండా ఉంది స్టార్​ హీరోయిన్​ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. లాక్‌డౌన్‌ తర్వాత మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసి మళ్లీ షూటింగ్‌ పనుల్లో నిమగ్నమయ్యేందుకు సిద్ధమయ్యింది. కాగా.. ఈ దిల్లీ చిన్నది టాలీవుడ్‌కు పరిచయమై ఆదివారంతో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది.

“టాలీవుడ్‌లో నా ప్రయాణానికి 7 సంవత్సరాలు. ఒక దిల్లీ అమ్మాయి నుంచి పక్కా తెలుగమ్మాయి వరకూ సాగిన నా ప్రయాణం ఎంతో అందమైంది. నాపై విశ్వాసం ఉంచిన దర్శకనిర్మాతలు, సహనటులు, అభిమానులతో పాటు నాకు అండగా నిల్చున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రశంసలు, విమర్శలు అన్నీ.. నా ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఈ ప్రయాణం నా కుటుంబం, మేనేజర్‌, ఇతర సిబ్బంది సహకారంతోనే సాధ్యమైంది.”

– రకుల్​ప్రీత్​ సింగ్​, కథానాయిక

‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సుందరి. ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘రఫ్‌’, ‘లౌక్యం’, ‘కరెంట్‌ తీగ’, ‘పండగచేస్కో’, ‘కిక్‌2’, ‘బ్రూస్‌లీ’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’, ‘స్పైడర్‌’తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది. మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, నాగార్జున వంటి తెలుగులో అగ్రహీరోలతో తెరను పంచుకుంది. చివరిగా 2019లో వచ్చిన ‘మన్మథుడు2’లో నాగార్జున సరసన ఆమె నటించింది. ప్రస్తుతం మరో రెండు తెలుగు సినిమాల్లోనూ ఆమె నటిస్తోంది.

ఈమధ్య బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తుండటం వల్ల అటువైపే మొగ్గుచూపుతోందీ భామ. అక్కడ ‘దే దే ప్యార్ దే’, ‘మార్జావాన్’, ‘సిమ్లా మిర్చి’ వంటి సినిమాల్లో నటించింది. మరో మూడు హిందీ సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This