ఇద్దరు స్టార్​హీరోల సినిమాలో పైలట్​గా రకుల్

‘బిగ్​ బి’ అమితాబ్‌ బచ్చన్​ కథానాయకుడుగా ప్రముఖ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే.. ఓ ముఖ్య పాత్రలోనూ కనిపించనున్నారు అజయ్‌. ఆయన పైలట్ రోల్​లో ఆకట్టుకోనున్నారు. తాజాగా నాయిక వివరాలు వెల్లడించింది చిత్రబృందం. అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవుతోంది. కో పైలట్‌గా దర్శనమివ్వనుంది.

“అమితాబ్‌తో నటించాలనే నా కల నెరవేరబోతుంది. అజయ్‌ దేవగణ్‌ నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని ట్వీట్‌ చేసింది రకుల్‌. ఈ డిసెంబరులో హైదరాబాద్‌లో షూటింగ్‌ మొదలవుతుంది. థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మేడే’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This