మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: రకుల్​

భూమాత పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాలని ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్​సింగ్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా కథానాయకుడు నాగచైతన్య విసిరిన సవాల్​ను స్వీకరించిన ఆమె.. జూబ్లీహిల్స్​లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటారు.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో ఒకరు ఇద్దరు కాదు.. అందరం కలిసి భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు రకుల్. తన అభిమానులంతా హరిత సవాల్​ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అలాగే మరో కథానాయిక నభా నటేష్ కూడా బెంగళూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగస్వామిగా నిలిచారు. బెల్లంకొడ సాయిశ్రీనివాస్, కథానాయికలు అను ఇమ్మాన్యుయేల్, నిధి అగర్వాల్​కు హరిత సవాల్ విసిరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This