రియా డ్రగ్స్​​ కేసులో రకుల్​ప్రీత్​​ పేరు..!

బాలీవుడ్​ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటకొస్తోంది. ఈ కేసులో నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో.. హీరోయిన్​ రియా చక్రవర్తిని ఇటీవల అరెస్టు చేసింది. దర్యాప్తులో భాగంగా రియా.. డ్రగ్స్​ తీసుకున్న 25 బాలీవుడ్​ సెలబ్రిటీల పేర్లను బయటపెట్టింది. అయితే ఇప్పటివరకు రహస్యంగా ఉన్న జాబితా నుంచి ముగ్గురి పేర్లు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ హీరోయిన్​ రకుల్ ప్రీత్ సింగ్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.

రకుల్​తో పాటు బాలీవుడ్​ నటి సారా అలీఖాన్, సెలబ్రిటీ డిజైనర్ సిమోన్ ఖంబాటాల పేర్లు ఉన్నాయి. దీంతో అటు బాలీవుడ్​ ఇటు టాలీవుడ్​లోనూ ఆందోళన నెలకొంది.

తనతో పాటు సారా అలీ ఖాన్, సిమోన్ ఖంబాటా కూడా సుశాంత్​తో కలిసి మాదక ద్రవ్యాలు సేవించినట్లు.. రియా అధికారుల వద్ద ఒప్పుకుందని సమాచారం. ఇప్పటికే నెటిజన్లు.. సారా అలీఖాన్​ను నెట్టింట్లో విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు. సిమోన్ ఖంబాటా- రియా డ్రగ్స్​ సందేశాలు ఇటీవలే వైరల్​ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This