8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు

రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సభలో చేసిన ఆందోళనపై ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన 8 మందిని సభ ముగిసే వరకూ సస్పెండ్‌ చేశారు. డెరెక్ ఓబ్రెయిన్‌, సంజయ్ సింగ్, రాజు సతవ్, కె. కె. రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీంలను సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్‌ తెలిపారు. ప్రతిపక్షాలు డిప్యూటీ ఛైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నిబంధనల ప్రకారం లేనందున తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.

బిల్లుల చర్చ, ఓటింగ్‌ సమయంలో నిన్న విపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును ఛైర్మన్‌ తీవ్రంగా ఆక్షేపించారు. రాజ్యసభ చరిత్రలో ఓ చీకటి దినంగా మిగిలిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భౌతికంగా ఇబ్బంది పెట్టడంతో పాటు డిప్యూటీ ఛైర్మన్‌ను తన విధుల్ని నిర్వర్తించకుండా అడ్డుపడ్డారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ అనూహ్య పరిణామాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఘటనను తీవ్రంగా ఖండించారు. నిరసనలకు కారణమైన ఎంపీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

అనంతరం రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాల నిరసన చేపట్టాయి. సభలో నిల్చుని నినాదాలు చేశారు పలువురు సభ్యులు. సస్పెండైన సభ్యులు సభ నుంచి వెళ్లాలని ఛైర్మన్​ సూచించినా వినిపించుకోలేదు. దీంతో సభను రెండు సార్లు వాయిదా పడింది.

  • నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించారని 8 మంది సభ్యులపై చర్యలు
  • వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా నిన్న రాజ్యసభలో నిరసనలు
  • డిప్యూటీ ఛైర్మన్ ముందు మైకు లాగేందుకు యత్నించిన పలువురు ఎంపీలు
  • రూల్‌బుక్‌ను చింపి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై విసిరిన టీఎంసీ ఎంపీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This