‘ఆత్మ నిర్బర్ భారత్..​ ఒంటరివాదానికి సూచన కాదు’

కరోనా మహమ్మారి సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలంటే ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలన్నారు నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​ కుమార్. బహుపాక్షికత, అంతర్జాతీయ ఐక్యత ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు. ‘ఆత్మనిర్బర్​ భారత్’​ ద్వారా కొవిడ్​ సంక్షోభాన్ని అధిగమించవచ్చని ప్రధాని నేరేంద్ర మోదీ చెప్పిన మాటలు ఒంటరివాదాన్ని సూచించవని వివరించారు రాజీవ్. బహు పాక్షిక, ప్రపంచ ఆర్థిక క్రమానికి భారత్​ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 2వ జాతీయ స్వచ్ఛంద సమీక్ష(వీఎన్​ఆర్​)ను ఐక్యరాజ్యసమితికి సమర్పించింది భారత్​. ఆన్​లైన్​ ద్వాారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజీవ్​ కుమార్​ పాల్గొన్నారు. ఉన్నతస్థాయి రాజకీయ వేదికగా వివరాలను సమర్పించారు. ప్రపంచ దేశాల ముందు కరోనా హమమ్మారి అనేక కొత్త సవాళ్లను ఉంచిందని నొక్కి చెప్పారు రాజీవ్.

” అన్ని సభ్య దేశాలు వాతావరణ మార్పు, పేదరికం, మానవ అక్రమ రవాణా, ప్రకృతి వైపరీత్యాలు సహా అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. బహుపాక్షికత, అంతర్జాతీయ ఐకమత్యం ద్వారా మాత్రమే వీటిని విజయవంతంగా పరిష్కరించవచ్చు.”

-రాజీవ్ కుమార్​, నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​

కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులను అవకాశాలుగా మార్చుకొని ప్రపంచదేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలని రాజీవ్​ సూచించారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు 276 బిలియన్​ డాలర్లలో భారత్​ ఉద్దీపన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇది భారత జీడీపీలో 10శాతమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This