ర‌జ‌నీ యోగ‌క్షేమాలు తెలుసుకున్న మోహ‌న్‌బాబు

సూపర్​స్టార్​ రజనీకాంత్​కు అత్యంత సన్నిహితుడైన మోహన్​ బాబు.. రజనీ యోగక్షేమాలను తెలుసుకున్నారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్​ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోహన్​బాబు.. రజనీ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన యోగక్షేమాలను తెలుసుకునేందుకు రజనీ భార్య లత, కుమార్తె ఐశ్వర్యలకు ఫోను చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెప్పడం వల్ల మోహన్​ బాబు కుదుటపడ్డారు.

రజనీకాంత్​.. మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి అని, ఆయన త్వరగా కోలుకుని, ఎప్పటిలాగే తన పనులు మొదలు పెడతారని మోహన్​ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This