మీ కళ్లను మోసం చేసే రజనీకాంత్ లుక్

తమిళ సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించిన సినిమా ‘రోబో’. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సత్తా చాటింది. అయితే అప్పుడు ఫొటోషూట్‌లో తీసిన ఓ ఫొటోను సినిమాటోగ్రాఫర్‌ రిచార్డ్‌ ఎమ్‌ నతన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇంత వరకు ఈ లుక్‌ బయటికి రాలేదని పేర్కొన్నారు.

‘2008లో ‘రోబో’ సినిమా ఫొటోషూట్‌లో నేను తీసిన స్టిల్‌ ఇది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో తలైవా లుక్‌ అలా తయారు చేశామని అందరూ అనుకున్నారు. కానీ ఈ షూట్‌ కోసం రజనీకి సిల్వర్‌ రంగు పెయింట్‌ వేశారు. ఇప్పటి వరకు విడుదల చేయని ఫొటో చూడండి..’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

రజనీ ‘దర్బార్’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయనతార కథానాయిక. ఏఆర్ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం అందుకుంది. దీని తర్వాత తలైవా ‘అన్నాత్త’లో నటిస్తున్నారు. శివ దర్శకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This