తరుముకొస్తున్న నిసర్గ – అప్రమత్తమైన రాష్ట్రాలు

ముంబయి వెర్సోనా తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. గాలులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అలీబాగ్ (రాయ్​గఢ్​)కి సమీపంలో నిసర్గ తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది.

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను తీవ్ర తుపానుగా మారి ఇవాళ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ జిల్లా అలీబాగ్‌ సమీపంలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎన్​డీఆర్ఎఫ్​ బలగాలు కూడా రంగంలోకి దిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This