ఓటమికి కారణం మా తప్పులే : కేఎల్​ రాహుల్​

తమ ఆటగాళ్ల తప్పిదాల వల్లే ముంబయి చేతిలో ఓడిపోయామని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. గురువారం జరిగిన మ్యాచ్​లో 48 పరుగుల తేడాతో ఓడింది పంజాబ్. మ్యా్చ్ అనంతరం ఓటమిపై స్పందించాడు రాహుల్.

గత నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓటమి పాలయ్యాం. ఇది చాలా బాధగా ఉంది. ఈ మ్యాచ్​లోనూ కొన్ని పొరపాట్లు చేశాం. త్వరగా సరిదిద్దుకోవడం మాకు చాలా ముఖ్యం.

-కేఎల్​ రాహుల్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సారథి

ముంబయి విజయంలో రోహిత్‌ శర్మ (70), పొలార్డ్‌(47), పాండ్య(30) కీలక పాత్ర పోషించారు. చివర్లో దిగిన పొలార్డ్​, పాండ్య వరుస బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఆఖరి 6 ఓవర్లలో 104 పరుగులు సాధించడం విశేషం.

ఈ మ్యాచ్​లో 25 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్(పంజాబ్) ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 246 పరుగులతో ఉన్నాడు.

“ఈ క్యాప్​ పంజాబ్​ జట్టులో ఉన్నంత వరకు నేను సంతోషంగా ఉంటా. మయాంక్​ ఎంతో కష్టపడతాడు. అందుకే ఇది వరించింది. అయినా త్వరలోనే అతడి నుంచి నేను తీసేసుకుంటాను” అని కేఎల్ రాహుల్ చెప్పాడు.​ ​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This