ప్రియాంక గాంధీపై చేయి వేయడానికి ఎంత ధైర్యం: భాజపా

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను డిమాండ్​ చేశారు మహారాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు చిత్రా వాఘ్​. ప్రియాంక దుస్తులు, చేయి పట్టుకుని పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు.

“మహిళా నాయకురాలి దుస్తులపై మగ పోలీసులు చేయివేయడానికి ఎంత ధైర్యం. పోలీసులు వారి హద్దులు తెలుసుకోవాలి. భారత సంప్రదాయలపై నమ్మకం ఉన్న యోగి ఆదిత్యనాథ్​.. ఈ ఘటన విషయంలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి.”

– చిత్రా వాఘ్​, మహారాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This