మాస్​కు కేరాఫ్​ అడ్రస్​.. దర్శకుడు పూరీ జగన్నాథ్

ఎవరు సినిమా తీస్తే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందో… అతడే పూరీ జగన్నాథ్‌. సినిమాను విభిన్న శైలిలో తీస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడీ డైరక్టర్. మాస్ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచిన పూరీ.. నేడు 55వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పూరీపై ప్రత్యేక కథనం.

తిట్లే అతడి సినిమా టైటిల్స్..!

పోకిరి, ఇడియట్, దేశముదురు ఇలాంటి వాటిని టైటిల్స్​గా పెట్టాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. కానీ పూరీ మాత్రం వీటినే టైటిల్స్​గా పెట్టి హిట్​లు కొట్టాడు.ఇంటి పేరు పూరీ కాదు..! ఈ దర్శకుడు ఇంటి పేరు పెట్ల. కానీ పూరీ జగన్నాథ్​ గానే అందరికీ సుపరిచితం. పూరీ జగన్నాథుడు ఆరాధ్య దైవం కావడం వల్లే ఆ పేరు పెట్టుకున్నాడు.

ఆర్​జీవీ అసిస్టెంట్​గా ఇండస్ట్రీలోకి

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సహాయకుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు పూరీ.

తెలుగులో పలు చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు కన్నడలోనూ పనిచేశాడు. పునీత్ రాజ్​కుమార్​ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీనే కావడం విశేషం. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తోనూ పనిచేసిన ఘనత ఈ డైరెక్టర్‌ సొంతం.

పవన్‌తో సినీ కెరీర్‌ ప్రారంభం

తన కెరీర్​ను పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ‘బద్రి’తో ఆరంభించిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, ఆంధ్రావాలా, పోకిరి, బుజ్జిగాడు, దేశముదురు, నేనింతే, గోలీమార్‌, బిజినెస్‌మేన్‌, ఇద్దరమ్మాయిలతో, హార్ట్‌ ఎటాక్‌, టెంపర్, మెహబూబూ, ‘ఇస్మార్ట్​ శంకర్’​ వంటి సినిమాలతో గుర్తింపు పొందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This