విశాఖ రాంకీ ఫార్మాసిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో… పోలీసులు భారీగా మోహరించారు. సాల్వెంట్స్​ ఫార్మా పరిసరాల్లోకి వెళ్లకుండా రహదారులు మూసివేశారు. పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు యత్నించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు.

పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్‌ సంస్థలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించగా.. దాదాపు 5 గంటలపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. అగ్ని ప్రమాదంపై చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This