పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు: దేవినేని

రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు చేయట్లేదని.. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ ఆరోపించారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. భారతి సిమెంట్‌ గురించి ప్రశ్నించిన పట్టాభిని అరెస్టు చేయమని ఆదేశాలు రావడం సిగ్గుచేటని విమర్శించారు. పోలీసుల ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేయారా.. అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలను హైకోర్టు కొట్టివేయడంతో.. ఆ అంశాన్ని బయటకు రాకుండా పోలీసులతో హడావిడి చేస్తున్నారని ఆక్షేపించారు. సీఎం దిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This