ఆగని పెట్రో వాత.. 21వ రోజూ ధరలు పైపైకి

పెట్రోల్, డీజిల్​ ధరల మోత కొనసాగుతోంది. చమురు ధరలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. వరుసగా 21వ రోజూ ధరలు పెంచాయి చమురు సంస్థలు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శనివారం లీటర్​ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగింది. డీజిల్ ధర లీటర్​పై 21 పైసలు ఎగబాకింది.

21 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్​పై సుమారు రూ.9.08, డీజిల్ ధర లీటర్​పై దాదాపు రూ.10.96 మేర పెరిగింది. వరుస ధరల పెంపుతో దిల్లీలో డీజిల్ ధర సరికొత్త గరిష్ఠానికి చేరింది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

నగరం పెట్రోల్

(లీటరుకు రూ.లలో)

డీజిల్

(లీటరుకు రూ.లలో)

దిల్లీ 80.38 80.40
హైదరాబాద్ 83.41 78.55
బెంగళూరు 82.97 76.44
ముంబయి 87.12 78.69
చెన్నై 83.57 77.06
కోల్​కతా 82.03 75.51

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This