పెట్రో మోత @17వ రోజు.. నేటి ధరలు ఇవే

వాహనదారులపై 17వ రోజూ పెట్రో ధరల భారం మోపాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం లీటర్​ పెట్రోల్ ధర 20 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్​పై 50 పైసలకుపైగా ఎగబాకింది.

17 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్​పై రూ.8.50, డీజిల్ ధర లీటర్​పై రూ.10.01 పెరిగింది. వరుస ధరల పెంపుతో దిల్లీ మినహా మిగతా ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటర్​కు రూ.81 నుంచి రూ.86 మధ్య కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This