జానీ దర్శకత్వంలో పవన్.. నిర్మాతగా చరణ్!

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​పై తనకున్న అభిమానాన్ని చాలాసార్లు చాటి చెప్పారు కొరియోగ్రాఫర్ జానీ. ఆయనతో ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా సెట్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.

పవన్ కోసం జానీ ఓ కథను సిద్ధం చేశాడని.. అది ఆయనకు వినిపించడం కూడా జరగిందని తెలుస్తోంది. ఈ స్టోరీపై ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్​లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. బాబాయ్ హీరోగా ఓ సినిమాను రూపొందించేందుకు చరణ్ కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం దాదాపు ఖరారయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పవన్ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అలాగే క్రిష్​తో పాటు హరీశ్ శంకర్, సాగర్ చంద్ర దర్శకత్వంలోనూ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమాలు పూర్తయ్యాకే జానీతో చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This