మోదీపై నమ్మకానికి నిదర్శనం ఈ ఫలితాలు: పవన్‌

బిహార్‌ శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపా కూటమి సాధించిన విజయం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం జాతీయ దృక్పథంతో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని చేపడుతున్న కార్యక్రమాలు ఈ విజయంలో కీలకాంశాలుగా నిలిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌, రైతులు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల కోసం మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ పథకాలు సగటు ఓటర్లను ఆలోచింపచేశాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు నడ్డాలకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This