క్రిష్​కు ప్రత్యేకంగా విషెస్ తెలిపిన పవర్ స్టార్

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​.. విలక్షణ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నపూర్ణ స్టూడియోస్​లో ‘వకీల్​సాబ్’ చిత్రీకరణలో పవన్​ పాల్గొనగా.. అక్కడికి చేరుకున్న క్రిష్​కు పవర్​స్టార్​ పుష్పగుచ్ఛం ఇచ్చి విషెష్​ తెలిపారు.

క్రిష్​ పుట్టినరోజు సందర్భంగా ముందుగా పూల బోకేను పంపిన పవన్​ కల్యాణ్​.. దర్శకుడు కలిసిన తర్వాత మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. క్రిష్​తో పాటు నిర్మాత ఏఎమ్​ రత్నం పవన్​ను కలిశారు. ​త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం నుంచి అప్​డేట్​ వచ్చే అవకాశం ఉంది. పీరియాడికల్​ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This