సీఎం అభ్యర్థిగా మళ్లీ ‘పళనిస్వామి’కే ఓటు

2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం ఎడప్పాడి పళనిస్వామినే ఖరారు చేసింది అన్నాడీఎంకే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పార్టీ నేత పన్నీర్​ సెల్వం. దీంతో గత కొన్ని రోజులుగా తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో.. పార్టీ వ్యూహాల కోసం 11 మంది సభ్యులతో ఓ స్టీరింగ్​ కమిటీని నియమించినట్లు పన్నీర్​ సెల్వం స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే చీఫ్‌ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు ఓ కమిటీని నియమించినట్టు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This