పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ మృతి

పాక్​కు దీటుగా జవాబు..

జమ్ముకశ్మీర్​లోని నౌషిరా సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ అమరుడయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భారత జవాన్​ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల పాక్​ వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్​ చర్యలకు భారత సైనికులు దీటుగా సమాధానమిచ్చారు. సోమవారం తెల్లవారుజామున భారత్​-పాక్ బలగాల మధ్య దాదాపు రెండు గంటలపాటు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో ఈ నెలలోనే నలుగురు జవాన్లు అమరులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This