భారత గగనతలంలోకి పాక్​ డ్రోన్​.. కూల్చిన భద్రతా దళాలు

భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంట దాయాదికి చెందిన ఓ డ్రోన్​ను కూల్చేసింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్). కథువా జిల్లా పన్సార్​ ఔట్​ పోస్ట్ పైనుంచి ఎగురుతూ వెళ్తున్న పాక్ డ్రోన్​ను గమనించిన సిబ్బంది ఉదయం 5.10 గంటలకు నేలకూల్చారు. డ్రోన్​ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ అనుమానాస్పద డ్రోన్ 250 మీటర్ల మేర భారత్​లోకి చొచ్చుకొచ్చిందని.. తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం నేలకూలిందని చెప్పింది సైన్యం. ఘటనా స్థలానికి వెళ్లిన సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This