పవర్ స్టార్​ ఫార్ములాను వదలని నితిన్

టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక మందణ్న​ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. దీపావళి సందర్భంగా ఫస్ట్​లుక్​ను విడుదల చేసిన చిత్రబృందం. తాజాగా ఫస్ట్​ గ్లిమ్స్ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది.

కొత్త వీడియో చూస్తుంటే నితిన్, రష్మిక జంట తెరపై కనువిందు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రష్మిక నడుమును చూస్తూ నితిన్ మరోసారి పవన్ కల్యాణ్​ ‘ఖుషి’ని తలపించాడు. “నా లవ్వు కూడా విజయ్ మాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటది కానీ.. క్యాచ్ చేయలేం” అంటూ నితిన్ పలికే డైలాగ్​ ఆకట్టుకునేలా ఉంది.

‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్.. ఈ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నాడు. సితార ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫ్రిబ్రవరి 21న విడుదలకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This