మెగా డాటర్​ నిహారికకు​ కాబోయే భర్త ఇతడే

మెగా బ్రదర్​ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గురించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు, సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవలే ఇందుకు సంబంధించి నిహారిక చిన్న క్లూ ఇవ్వడం సహా.. కాబోయే వ్యక్తితో దిగిన ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం కనపడకుండా అటువైపు తిప్పి ఉండటం వల్ల ఎవరై ఉంటారా? అని మెగా అభిమానులంతా నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో మరో పోస్ట్ పెట్టిన నిహారిక అతనెవరో రివీల్​ చేసింది.

అబ్బాయి ఎవరంటే..

అబ్బాయి పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. గుంటూరులోని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడని సమాచారం. చైతన్య హైదరాబాద్​లోని ఓ ఎంఎన్​సీ కంపెనీలో పని చేస్తున్నాడట. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం వల్ల.. నిహారిక, చైతన్య రెండు మూడు సార్లు కలిసి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This