భార్యకు లీగల్​ నోటీసు పంపిన నవాజుద్దీన్​

బాలీవుడ్​ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియాకు లీగల్​ నోటిసు పంపించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణల విషయంలో ఆమె వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సమాజంలో కీర్తిప్రతిష్టలకు భంగం కలిగించటానికే ఉద్దేశపూర్వంగా, పక్కాప్రణాళికతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని నటుడు తరఫున న్యాయవాది వెల్లడించారు.

తన భర్త నవాజూద్దీన్​ నుంచి విడాకులు కావాలని మే7 కోర్టును ఆశ్రయించారు ఆలియా. అతడికి తనకు మధ్య బేధాభిప్రాయాలను ఉన్నాయని తెలిపారు.

ఈ మధ్య కాలంలో తమ పిల్లల పాఠశాల ఫీజులను నవాజుద్దీన్​ కట్టడం మానేశాడని ఆలియా ఆరోపించించారు. ఆర్థిక భారం వల్ల తాను చెల్లించలేకపోతున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఖండించిన నవాజ్​ న్యాయవాది.. పిల్లల పాఠశాల రుసుమును అతడు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This