అమెజాన్​ ప్రైమ్​పై నాని అభిమానుల ​అసంతృప్తి!

నేచురల్ స్టార్ నాని 25వ చిత్రమైన ‘వి’ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్​ ప్రైమ్​లో సెప్టెంబరు 5న విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్​ను ఆగస్టు 25న(మంగళవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది అమెజాన్​. దీనికోసం అభిమనులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ దీనికి బదులుగా ఓ ప్రమోషనల్​ ఈవెంట్​ను నిర్వహించి అభిమానుల ఆశలను అడియాశలు చేసింది ప్రైమ్. ఇందులో భాగంగా అభిమానుల నుంచి సెల్ఫీ కాంటెస్ట్ పెట్టింది. దీంతో నాని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సదరు సంస్థపై మండిపడుతున్నారు.

కాగా దీనిపై స్పందించిన ప్రైమ్.. బుధవారం ఉదయం ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీనికి నాని రిప్లై ఇస్తూ.. “సాయంత్రం అనుకున్నాం.. కానీ ఉదయానికి రిలీజ్ చేస్తారా. సంతోషం. మాకూ ఇదే కావాలి” అంటూ కామెంట్ పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This