ముగ్గురు భామలతో చైతూ సందడి

నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ తెరకెక్క బోతోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ముగ్గురు భామలు ఆడిపాడనున్నారు. ప్రస్తుతం కథానాయికల ఎంపికపై దృష్టి సారించింది చిత్రబృందం. త్వరలోనే చిత్రీకరణ షురూ కాబోతోంది.

ఓ కథానాయికగా ‘గ్యాంగ్‌లీడర్‌’తో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంక మోహన్‌ ఎంపికైనట్టు సమాచారం. ఆ చిత్రం విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఆయన రెండోసారి ప్రియాంకకు అవకాశం ఇస్తున్నాడన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This