‘కరోనా అందరి సమస్య.. కలిసే పోరాడుదాం’

“కరోనా వైరస్​ సోకిన వారి పట్ల వివక్ష చూపకండి. అందరం కలిసి ధైర్యంగా పోరాడటం ద్వారానే ఈ మహమ్మారి బారి నుంచి బయట పడగలం” అంటున్నాడు టాలీవుడ్​ ప్రముఖ హీరో నాగచైతన్య. ప్రస్తుతం కరోనా సోకిన కుటుంబాలు, వ్యక్తుల పట్ల సమాజంలో అనేక చోట్ల వివక్ష కనిపిస్తోంది. అలాగే వైరస్​పై ప్రజల్లో అనేక భయాలు, అపోహలు నెలకొని ఉన్నాయి. అందుకే వీటన్నింటిపైనా అవగాహన కల్పించే ఉద్దేశంతో.. దర్శకుడు శేఖర్​ కమ్ముల విసిరిన సవాల్​ మేరకు నాగచైతన్య తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా కొవిడ్​ను జయించిన సునీత అనే నర్సుతో ఆన్​లైన్​ ద్వారా ముచ్చటించి.. వ్యాధిపై పోరులో ఆమె అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం చైతన్య మాట్లాడుతూ.. “కరోనా సోకిందని తెలియగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు. నిజానికి తీవ్ర భయం, ఒత్తిడికి గురవ్వడం వల్లే ఎక్కువ సమస్యలొస్తాయి. ఈ భయాలతోనే చాలా మందిలో వైరస్​ లక్షణాలున్నా బయటకు చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాపాయ పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ముందు ఇలాంటి అనవసర భయాల్ని వీడండి. వైరస్​ నుంచి కోలుకున్నాక మీ అనుభవాల్ని అందరితో పంచుకోండి. కరోనాను జయించిన తర్వాత ప్లాస్మా దానం చేయడం మర్చిపోకండి. ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆ సాయం చాలా మంది ప్రాణాల్ని నిలబెడుతుంది” అని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This