‘సూపర్​’ కాంబోతో హ్యాట్రిక్​ కొడతారా?

కింగ్​ నాగార్జున – పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు చెప్పిన స్టోరీ నాగార్జునకు నచ్చడం వల్ల ఆయన గ్రీన్​సిగ్నల్​ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూరి రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​ జరుగుతుందని తెలుస్తోంది. ఈ వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘బిగ్​బాస్​ 4’ రియాల్టీ షో చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రొమో ఇటీవలే విడుదలై.. ప్రేక్షకుల నుంచి విశేషాదరణను దక్కించుకుంది. ఈ నెలాఖరు నుంచి ఈ రియాల్టీ షో ప్రసారం కానుంది. ప్రస్తుతం పూరి​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా ఓ పాన్​ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అనన్యా పాండే హీరోయిన్​గా నటిస్తుండగా.. పూరీ జగన్నాథ్​, ఛార్మి, కరణ్​ జోహర్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This