ప్రియురాలిని కాల్చిచంపి- ప్రియుడూ ఆత్మహత్య

ప్రియురాలిని కాల్చి చంపి, ఆపై ప్రియుడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబయిలోని సబర్బన్​ మలాద్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న బంగూర్​ నగర్ పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ​

రాహుల్​ యాదవ్​ అనే వ్యక్తి తన ప్రియురాలు నిధి మిశ్రాను ఓ బిల్డింగ్​లో కాల్చి చంపినట్లు, తర్వాత అదే గన్​తో అతను కాల్చుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మా దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. వారిద్దరి సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. వారి మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కేసు విషయమై మాకొక ప్రత్యక్ష సాక్ష్యం లభ్యమైంది.

– విశ్వాస్​ నంగ్రీ పాటిల్​, లా అండ్​ ఆర్డర్​ జాయింట్​ కమిషనర్​.

యువతి నిధి మిశ్రాకు ఇటీవల మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని.. అప్పటి నుంచి ఆమె సంతోషంగా లేదని మరొక పోలీసు అధికారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This