మార్కెట్లలో ‘రియల్’​ జోష్​… సెన్సెక్స్​ నయా రికార్డ్​

నెమ్మదించిన ప్రగతి రథం తిరిగి పుంజుకుంటుందన్న అంచనాల మధ్య స్టాక్​మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ సెషన్​ ఆరంభంలో​ 200 పాయింట్లకుపైగా ఎగబాకి 40 వేల 670 పాయింట్ల గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం దాదాపు 100 పాయింట్ల లాభంతో 40 వేల 560 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 12 వేల 5 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు…

నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా బుధవారం కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోవడం మదుపర్లలో ఉత్సాహం నింపింది.

దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండడం… జీడీపీ వృద్ధి పుంజుకుంటుందనే ఆశలు రేకెత్తించింది.

లాభనష్టాల్లో…

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐ, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్​, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్​ 3 శాతం వరకు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టాటా స్టీల్, వేదాంత, ఓఎన్​జీసీ, హీరో మోటోకార్ప్, టాటా మోటర్స్​, ఎస్​ బ్యాంక్, బజాజ్ ఆటో 2 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి… ముడి చమురు…

ఆరంభ సెషన్​లో రూపాయి డాలరుతో పోల్చితే 10 పైసలు తగ్గి 71.07 వద్ద ట్రేడవుతోంది.

బ్రెంట్ ముడి చమురు ధర స్వల్పంగా తగ్గి బ్యారెల్​కు 61.70 డాలర్లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This