ఓటీటీల్లో హిట్టు మాట వినపడినట్లేనా!

జయాపజయాలు ప్రతి రంగంలోనూ సాధారణమే అయినా.. చిత్ర సీమలో విజయానికున్న ప్రాధాన్యం వేరు. ఇక్కడ హిట్టు మాటే స్ఫూర్తి మంత్రంలా పని చేస్తుంటుంది. ఒక్క సినిమా విజయం ఎన్నో చిత్రాలకు కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంటుంది. అద్భుత ప్రతిభావంతుల్ని, సరికొత్త కథల్ని వెండితెరకు కానుకగా అందిస్తుంటుంది. అందుకే ఈ రంగంలోని ప్రతిఒక్కరూ ‘హిట్టుదేవోభవ’ అంటూ నిద్రలోనూ కలవరిస్తుంటారు. బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటాలని పరితపిస్తుంటారు. కానీ, ఈ ఏడాది సినీ రంగాన్ని కరోనా కోలుకోలేని దెబ్బ కొట్టింది. వెండితెర వినోదాలకు సినీప్రియుల్ని దూరం చేసింది. ఈ తరుణంలోనే.. ఓటీటీ వేదికలు సినీ వినోదాలకు ప్రత్యామ్నాయాలుగా మారాయి. మరి ఈ ప్రత్యామ్నాయ వినోద మాధ్యమాలపై హిట్టు మాట వినిపించుకున్న చిత్రాలెన్ని.. పరాజయాల్ని మూట కట్టుకున్న సినిమాలెన్ని? తెలుసుకుందాం పదండి..

‘అల.. వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ విజయాలు ఈ ఏడాది తెలుగు చిత్రసీమకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాయి. తర్వాత వచ్చిన ‘అశ్వథ్థామ’, ‘హిట్‌’, ‘భీష్మ’, ‘పలాస’ లాంటి చిన్నా పెద్ద చిత్రాలు ఆ హిట్టు బాటలోనే నడవడం వల్ల ఈ ఏడాది టాలీవుడ్‌కు తిరుగులేనట్లే అనుకున్నారు. కానీ, కరోనా దెబ్బకు ఈ ఆనందం మూడ్నెళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల మార్చిలో మూతపడిన థియేటర్లు ఇప్పటి వరకు మళ్లీ తెరచుకోలేదు. అసలు వెండితెరపై మళ్లీ కొత్త బొమ్మ ఎప్పుడు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో దర్శక నిర్మాతలకు, సినీప్రియులకు ఓటీటీ వేదికలే కాస్తో కూస్తో ఓదార్పునందించాయి. గత ఆర్నెళ్లుగా చిన్నాపెద్ద సినిమాలన్నీ వివిధ ఓటీటీ వేదికల ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This