మీర్జాపుర్ నిర్మాతలకు ఊరట.. అరెస్ట్​ నిలిపివేసిన కోర్టు

మీర్జాపుర్ నిర్మాతలకు ఊరట లభించింది. ఈ సిరీస్​లో తమ ప్రాంతాన్ని ఉన్నదాని కంటే విరుద్ధంగా చూపించారని, వెంటనే ఆ సిరీస్​ను నిషేధించాలని విమర్శలు వచ్చాయి. ఓ వ్యక్తి ఇదే విషయమై కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసును విచారించిన అలహాబాద్​ కోర్టు నిర్మాతలు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్​ల అరెస్టును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విచారణలో పాల్గొనాలని వారికి ఆదేశించింది. విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

గ్యాంగ్​స్టర్​ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్​ మీర్జాపుర్​ విశేషాదరణ దక్కించుకుంది. కానీ ఈ మధ్యకాలంలో దీనిపై చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అలాగే అశ్లీలత, హింస ఇందులో మితిమీరిపోయిందని పలువురు మండిపడ్డారు. ‘బ్యాన్​మీర్జాపూర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులూ పెట్టారు.

ప్రస్తుతం ఈ సిరీస్​కు సంబంధించిన రెండు సీజన్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. కల్పిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందించారు. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్ దర్శకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This