పాటతో శ్రీ సింహా.. ‘నాట్యం’ ఫస్ట్​ లుక్

కూచిపూడి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తూనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యా రాజు హీరోయిన్​గా నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పస్ట్​లుక్​ను తాజాగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేశారు .

సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా నటిస్తున్న రెండో సినిమా ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శుక్లా హీరోయిన్​. మార్చిలో థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘అరె ఏమయిందో ఏమో’ అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. కాలభైరవ సంగీత దర్శకత్వం వహించి స్వయంగా ఆలపించిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This