‘ఈ పాట సైనికులకు, వారి భాగస్వాములకు అంకితం’

తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియోలో నటించారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. గాయని సునంద శర్మ పాడిన ‘పాగల్ నహీ హోనా’ పాటలో ఆర్మీ అధికారిగా కనిపించారు. రొమాంటిక్​గా సాగే ఈ పాటను జానీ రాశారు.

“ఇది నా తొలి మ్యూజిక్ వీడియో. కాన్సెప్ట్​ వినగానే తప్పకుండా చేయాలనుకున్నా. ‘పాగల్ నహీ హోనా’ పాటను జవాన్లు, వారి జీవిత భాగస్వాములకు అంకితమిస్తున్నాం. సునంద చాలా బాగా పాడారు. పాట సాహిత్యం మీ మనసులను హత్తుకుంటుంది.”

-సోనూసూద్, బాలీవుడ్ నటుడు

గాయని సునందతో ఈ వీడియోలో నటించారు సోనూసూద్. “సోనూ సార్ ఈ పాటకు సరిగ్గా సరిపోతారు. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది” అని సునంద చెప్పారు.

ప్రస్తుతం ‘కిసాన్​’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు సోనూ. లాక్​డౌన్​లో ప్రజల మన్ననలు పొందిన నేపథ్యంలో కేవలం పాజిటివ్ పాత్రల్లోనే నటిస్తానని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This