డబ్బింగ్​ చెబుతున్న.. ‘టక్​ జగదీష్’

వేసవిలో వినోదాలు పంచేందుకు తన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు నేచురల్​ స్టార్ నాని. ఆయన కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్, కథానాయికలు. సాహు గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

ఈ సినిమా డబ్బింగ్​ కార్యక్రమాలు సోమవారం నుంచి ఆరంభమైనట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. “నాని- శివ నిర్వాణ కలయికలో ‘నిన్నుకోరి’ తర్వాత రూపొందుతున్న చిత్రమిది. వేసవి ప్రత్యేకంగా ఏప్రిల్​లో విడుదల చేస్తున్నాం. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్​లుక్​కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంద”ని సినీ వర్గాలు వెల్లడించాయి.

‘టక్​ జగదీశ్​’లో జగపతి బాబు, నరేష్, రావు రమేష్, రోహిణి, నాజర్ తదితరులు నటిస్తున్నారు. ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This