రేటింగ్స్​లో వరుణ్​ ‘కూలీ నెం.1’ చెత్త రికార్డు

బాలీవుడ్ హీరో వరుణ్​ ధావన్​-హీరోయిన్​ సారా అలీఖాన్​ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ.నెం1’. ఈ చిత్రం అమెజాన్​ప్రైమ్​లో అత్యంత ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా ఇటీవల రికార్డుకెక్కింది. అయితే తాజాగా రేటింగ్​​ ప్రకారం అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐఎమ్​డీబీ చరిత్రలో అత్యంత తక్కువ రేటింగ్​ 1.4/10 అందుకున్న రెండో సినిమాగా నిలిచింది. అంతకుముందు సఢక్​ (1.1/10), హిమ్మత్​వాలా(1.7/10) చిత్రాలు అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాయి.

1995లో వచ్చిన ‘కూలీ నెం.1’కు రీమేక్​గా తెరకెక్కిందీ సినిమా. అందులో గోవింద, కరిష్మా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటి చిత్రంలో వరుణ్-సారా జంటగా కనిపించారు. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. తండ్రి డైరెక్షన్​లో వరుణ్​ నటించడం ఇది రెండోసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This