​అమెరికా కంటే ముందే భారత్​లో ఆ సినిమా​ విడుదల

సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టెనెట్’​. హాలీవుడ్​ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్​ తీసిన ఈ సినిమా.. జులై 17న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ విషయమై ఓ శుభవార్తను వెల్లడించారు నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్.​ ఆగస్టు 26న థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్​, బ్రిటన్​ సహా 70 దేశాల్లోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.అమెరికాలో మాత్రం కాస్త ఆలస్యంగా సెప్టెంబరు 3న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

సైన్స్​ ఫిక్షన్​ నేపథ్య కథతో తీసిన ‘టెనెట్’ ట్రైలర్​​ అంచనాలు పెంచుతోంది. రాబర్ ప్యాటిన్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్, డింపుల్ కపాడియా, కెన్నెత్ బ్రానాగ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This