బాహుబలి సినిమా ఈ శుక్రవారమే విడుదల!

లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లను తెరుచుకోవచ్చని గత నెలలోనే కేంద్రం ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి నియమ నిబంధనలూ విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మల్టీఫ్లెక్సులు తెరచుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సింగిల్‌ స్క్రీన్ల్‌తోనే థియేటర్లు నడుస్తున్నాయి.

గురువారం నుంచి మహారాష్ట్రలో, నవంబరు 10 నుంచి తమిళనాడులోనూ సినిమా హాళ్లు తెరవనున్నారు. అయితే వీటిల్లో ఆడించడానికి కొత్త సినిమాలు లేవు. ఫలితంగా గతంలో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలనే మళ్లీ ప్రదర్శించనున్నారు.

ఇలా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి చిత్రాన్ని రీ-రిలీజ్‌ చేస్తున్నట్లు కరణ్‌జోహర్‌ ప్రకటించారు. హిందీవర్షన్‌ ‘బాహుబలి- బిగినింగ్‌’ను ఈ శుక్రవారం, ‘బాహుబలి-కన్‌క్లూజన్‌’ను ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వెండితెర మీద మరోసారి బాహుబలిని చూడటానికి ప్రేక్షకులు వస్తారని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This