‘అన్‌ఫెయిర్ అండ్​ లవ్లీ’గా‌ అందాల నటి!

చర్మం రంగుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భం… అందమంటే తెల్లని రంగే అని భ్రమిస్తున్న సమాజంలో ఓ యువతి ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో ఇలియానా ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. హరియాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సోనీపిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా, మూవీ టన్నెల్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘శాండ్‌ కీ ఆంఖ్‌’, ‘ముబారకన్‌’ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేసిన బల్వీందర్‌సింగ్‌ జంజువా దర్శకత్వం వహిస్తున్నారు.

రన్‌దీప్‌ హుడా కథానాయకుడు. సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతం అందించనున్నారు. ‘సమాజంలో ఉన్న రుగ్మతలకు సున్నిత హాస్యాన్ని జోడించి చిత్రాలు తీయడమేకాకుండా… కొత్త టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని’ సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వివేక్‌ కృష్ణ తెలిపారు. ‘నిజజీవితంలో ఎదురైన ఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది.’ అని దర్శకుడు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This