డిజిటల్​ వేదికగా లండన్​ ఫిల్మ్ ఫెస్టివల్​!

ఈ ఏడాది జరగనున్న బ్రిటీష్​ చిత్ర పరిశ్రమకు చెందిన లండన్​ ఫిల్మ్ ఫెస్టివల్​ను కరోనా వ్యాప్తి కారణంగా ఆన్​లైన్​లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఓ హాలీవుడ్​ రిపోర్టర్​ సమాచారం ప్రకారం అక్టోబరు 7 నుంచి 18 వరకు జరగాల్సిన ఈ వేడుకను వైరస్​ నియంత్రణలో భాగంగా డిజిటల్​ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట .

వర్చువల్​ ప్రీమియర్స్​లో మొత్తం 50 సినిమాలు ప్రదర్శించనున్నారు. ప్రతి సినిమా తర్వాత ప్రశ్నోత్తరాల సమయంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వర్చువల్​ వర్షెన్​లో ఆన్​లైన్​ వేదికగా మాట్లాడుకోవడం సహా అభిప్రాయాలను పంచుకునే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This