సెట్​లో 19 మందికి కరోనా.. ఆగిన సినిమా షూటింగ్!

‘జురాసిక్ వరల్డ్’.. ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఈ సిరీస్​లో వస్తున్న ‘జురాసిక్ వరల్డ్: డొమినియన్’ చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది. సెట్​లో ఒకేసారి 19 మందికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని షూటింగ్ యూకేలో జరుగుతోంది.

ఈ సినిమాను తొలుత 2021 జులైలో విడుదల చేయాలనుకున్నారు కానీ, కరోనా వల్ల అదికాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీంతో 2022 జూన్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ యూనివర్సల్​ స్టూడియోస్ ప్రకటించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This