ట్రైలర్​: ‘నా భార్య కనిపించడం లేదు సార్​!’

‘మిస్సింగ్‌ కేసు సర్‌.. నా భార్య దిశ కనిపించడం లేదు..’ అంటున్నాడు నటుడు విశ్వ. స్నేహా ఉల్లాల్‌, మధు షాలినీ, అలీ రెజాలతో కలిసి అతడు నటించిన చిత్రం ‘ఎక్స్‌పైరీ డేట్‌’. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మించారు. థ్రిల్లర్‌ కథాంశంతో తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాను తెరకెక్కించారు. ఓటీటీ వేదికగా అక్టోబరు 9న తెలుగు వెర్షన్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ప్రచార చిత్రం అంచనాలు పెంచింది.

నటుడు విశ్వ తన సతీమణి స్నేహా ఉల్లాల్‌ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అదే రోజు నుంచి తన భర్త అలీ రెజా కూడా కనిపించడం లేదని నటి మధు షాలినీ పోలీసుల్ని ఆశ్రయిస్తుంది. ఈ రెండు కేసులకు సంబంధం ఏంటనే కోణంలో సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ఎవరు నేరస్థులు, ఎవరు బాధితులు అనే అంశాన్ని బయటపెట్టకుండా.. ట్రైలర్‌ను ఉత్కంఠగా రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This