ఒకేసారి థియేటర్లు, ఓటీటీలో అక్షయ్ సినిమా

ఈ దీపావళికి ముందే ‘లక్ష్మీ బాంబ్’ పేలనుంది. అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం.. నవంబరు 9న హాట్​స్టార్ వేదికగా విడుదల కానుంది. సరిగ్గా అదే రోజున న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈలోని థియేటర్లలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. తమిళ ‘కాంచన’కు రీమేక్.

ఇందులో హీరోయిన్​గా కియారా అడ్వాణీ నటించింది. అక్షయ్ సినిమా ఓటీటీలో విడుదలవుతుండటం వల్ల అటు అభిమానుల్లో, ఇటు బాలీవుడ్​లోనూ ఆసక్తి నెలకొంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This