72వ ఎమ్మీ అవార్డు వేడుకలో జెండేయా రికార్డు

ప్రముఖ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డు వేడుక (72వ) లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగింది. కరోనా కారణంగా ఈసారి వర్చువల్​గా ఈ వేడుకను నిర్వహించారు. ఆర్టిస్టులు వారి ఇంటివద్ద నుంచే పురస్కారాలు అందుకున్నారు. ప్రఖ్యాత టెలివిజన్ షోలు ఈ వేడుకలో సత్తాచాటాయి. 24 ఏళ్ల జెండేయా ఉత్తమ నటి​గా నిలిచి అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న నటిగా చరిత్ర సృష్టించింది.

ఈ వేడుకలు లాస్​ ఏంజెలిస్​లోని మైక్రోసాఫ్ట్ థియేటర్​లో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈసారి వర్చువల్​గా నిర్వహించారు. అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఎమ్మీ అవార్డు విజేతలు

  • ఉత్తమ నటుడు ( లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ సినిమా) – మార్క్ రఫాలో (ఐ నో దిస్ మచ్ ఈజ్ ట్రూ)
  • ఉత్తమ నటి ( లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ సినిమా) – రెజీనా కింగ్ (వాచ్​మన్)
  • ఉత్తమ సహాయ నటుడు (లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ సినిమా) – యాహ్యా అబ్దుల్ మటీన్ (వాచ్​మన్)
  • ఉత్తమ సహాయ నటి (లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ సినిమా) – ఉజో అడుబా (మిసెస్ అమెరికా)
  • ఉత్తమ నటుడు (కామెడీ సిరీస్ )- యూజీన్ లెవీ (షిట్స్ క్రీక్)
  • ఉత్తమ నటి (కామెడీ సిరీస్) – కేథరీన్ ఓహరా (షిట్స్ క్రీక్)
  • ఉత్తమ సహాయ నటుడు (కామెడీ సిరీస్) – డ్యాన్ లెవీ (షిట్స్ క్రీక్)
  • ఉత్తమ సహాయ నటి (కామెడీ సిరీస్) – అన్నీ మర్ఫీ (షిట్స్ క్రీక్)
  • ఉత్తమ నటుడు (డ్రామా సిరీస్) – జెరెమీ స్ట్రాంగ్ (సక్సెషన్)
  • ఉత్తమ నటి (డ్రామా సిరీస్) – జెండేయా (యుఫోరియా)
  • ఉత్తమ సహాయ నటుడు (డ్రామా సిరీస్) – బిల్లీ క్రుడుప్ (ద మార్నింగ్ షో)
  • ఉత్తమ సహాయ నటి (డ్రామా సిరీస్) – జూలియా గార్నర్ (ఒజార్క్)
  • ఉత్తమ సిరీస్ (రియాలిటీ/కాంపిటీషన్)- రు పాల్స్​ డ్రాగ్ రేస్
  • ఉత్తమ సిరీస్ (వెరైటీ టాక్ సిరీస్) – లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఒలివర్
  • ఉత్తమ సిరీస్ (లిమిటెడ్) – వాచ్​మన్
  • ఉత్తమ సిరీస్ (కామెడీ) – షిట్స్​ క్రీక్
  • ఉత్తమ సిరీస్ (డ్రామా) – సక్సెషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This