చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ

చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. సరిహద్దు వివాదంపై మేధోపరమైన చర్చకు, అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని భారత విధానాన్ని నిర్ణయించే లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సరిహద్దు ఘర్షణలపై స్పందించాలని మోదీని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు డిమాండ్​ చేశారు. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

“భారత్​-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష పార్టీ సమావేశానికి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వర్చువల్​ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటారు.”

-ప్రధానమంత్రి కార్యాలయం

దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. ఈ సైనిక ఘర్షణతో ఇరుదేశాల మధ్య సరిహద్దు వైరం మరింత ముదిరింది. తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా కవ్వింపు చర్యలు సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ దారితీసింది. ఇందులో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. మరి కొంతమంది గాయపడ్డారు. చైనా సైనికులూ 43 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This