భారత్​కు మద్దతిచ్చిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు

ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా భారత్​ ఎన్నికవటం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన అంతర్జాతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు.

“భారత సభ్యత్వానికి మద్దతు ఇచ్చిన దేశాలకు కృతజ్ఞతలు. సభ్యదేశాలతో కలిసి ప్రపంచ శాంతి, భద్రత, సమానత్వం కోసం కృషి చేస్తాం.”

– ప్రధాని నరేంద్రమోదీ

జయ్​శంకర్​ స్పందన..

భద్రతా మండలి ఎన్నికల్లో విజయంపై ఐరాసలోని భారత శాశ్వత మిషన్​, విదేశాంగ శాఖ బృందానికి విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ శుభాకాంక్షలు తెలిపారు. అధికారుల కృషి వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు.

ఏకగ్రీవంగా ఎన్నిక..

ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్​ఎస్​సీ)లోని 5 తాత్కాలిక సభ్యదేశాల కోసం బుధవారం (జూన్​ 17న) ఎన్నికల్లో భారత్​ ఘనవిజయం సాధించింది. ఓటింగ్​లో పాల్గొన్న 192 సభ్య దేశాల్లో కావాల్సిన మెజారిటీ మూడింట రెండొంతులు (128) దాటుకుని 184 ఓట్లు సాధించింది భారత్​.

ఈ సారి ఆసియా-పసిఫిక్ స్థానం నుంచి పోటీ చేసిన భారత్​ 2021-22 కాలానికి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది. 2021 జనవరి 1 నుంచి భారత్​ సభ్యత్వం అమల్లోకి వస్తుంది. 2022 డిసెంబరుతో ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This