పంట ధర నిర్ణయం రైతులకే- స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు

ఆరుగాలం కష్టపడే రైతు ఇక తనకిష్టమైన ధరకు పంటను అమ్ముకునే స్వేచ్ఛ లభించనుంది. తన ఉత్పత్తికి మరెవరో ధర నిర్ణయించడంతో శ్రమకు తగ్గ ఫలానికి దూరమవుతున్న అన్నదాతకు ఆ కష్టం తీరనుంది. రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం బుధవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకొంది. ఇందుకోసం జారీ చేసే రెండు అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌లు), ఒక చట్టసవరణ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.

“వ్యవసాయ సంస్కరణలతో సానుకూల ప్రభావం చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవసాయ సంస్కరణలతో గ్రామీణ భారతం రూపాంతరీకరణ చెందుతుంది. ఒకే భారత్‌-ఒకే వ్యవసాయ మార్కెట్‌ అన్నది సాకారం దాల్చుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడానికి, వివాదాల పరిష్కారానికి తగిన వ్యవస్థలు ఏర్పాటవుతాయి. వ్యాపారులతో లావాదేవీలు నిర్వహించేటప్పుడు రైతులకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. వారి ప్రయోజనాలకు భద్రత ఉంటుంది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This