నేడు కేంద్ర మంత్రివర్గ భేటీ-మరిన్ని కీలక నిర్ణయాలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం భేటీ కానుంది. 7 లోక్​కల్యాణ్ మార్గ్​లోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే మంత్రివర్గం రెండో సారి భేటీ కావడం గమనార్హం.

మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక రంగానికి సంబంధించి మరిన్ని అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కొవిడ్​ సంక్షోభం ఎదుర్కొంటున్న రంగాలకు మేలు కలిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం

సోమవారం జరిగిన కేబినెట్ మీటింగ్​లో చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్​ఎంఈ)లకు సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆత్మనిర్భర భారత్​లో భాగంగా ప్రకటించిన ఉద్దీపనలకు అనుగుణంగా దేశంలోని ఎంఎస్​ఎంఈలలో రూ. 50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది కేంద్రం. రైతులకు మేలు కలిగేలా 14 పంటల మద్దతు ధరలను ఒకటిన్నర రెట్లు పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This