నేడు మరో మూడు సంస్థలతో మోదీ భేటీ- టీకాపై ఆరా

కొవిడ్​​ వ్యాక్సిన్​ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మరో మూడు సంస్థలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నేడు భేటీకానున్నారు. వర్చువల్​గా ఈ సమావేశం జరగనుందని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. జెనోవా బయోఫార్మా, బయెలాజికల్​ ఈ, డాక్టర్​ రెడ్డీస్​ సంస్థల ప్రతినిధులతో మోదీ మాట్లాడనున్నారని తెలిపింది.

“కొవిడ్ వ్యాక్సిన్​ అభివృద్ధిలో భాగస్వాములైన మూడు సంస్థలతో ఈ నెల​ 30న వర్చువల్​గా నరేంద్ర మోదీ సమావేశం అవ్వనున్నారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్​ ఈ, డాక్టర్​ రెడ్డీస్​ సంస్థల అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు.”

– ప్రధానమంత్రి కార్యాలయం.

కొవిడ్​ టీకాను అభివృద్ధి చేస్తున్న మూడు కీలక సంస్థలను ప్రధానమంత్రి.. నవంబర్​ 28న సందర్శించారు. అహ్మదాబాద్​లోని జైడస్​ క్యాడిలా, హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్​, పుణెలోని సీరం సంస్థల్లో పర్యటించారు. వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీకా ఉత్పత్తి, పంపణీ సన్నద్ధతపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This